
ధాన్యం కొనుగోళ్ళలో ఎటువంటి కటింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే.
సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి..
(అఖండ భూమి) కొమురం భీం జిల్లా, డిసెంబర్ 13, దేహగాం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,దహేగాం మండల కేంద్రంలో మంగళవారం రోజు దహేగాం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ..
గతంలో మాదిరిగా రైతులు అమ్మిన ధాన్యం విషయంలో వడ్ల కటింగ్ చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. వ్యవసాయ,సహకార, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల వద్ద నుండి ఎటువంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని , అలాగే రైతుకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించాలని సూచించారు.
అధికారులందరూ రైతుల సేవలో నిమగ్నమై, రైతాంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాసరి వేణు, డి సి ఓ తారామణి, ఎం పి డి ఓ రాజేశ్వర్, సి ఓ, బక్కయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం అధికారులు, సింగిల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతి గౌడ్, వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజయ్, సర్పంచ్ పుప్పాల లక్ష్మీ , ఎంపిటిసి రాపర్తి జయ, మరియు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


