మిచాంగ్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర విఫలం… యనమల శివరామ కృష్ణన్

తొండంగి మండలం, ఒంటిమామిడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్.మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడం వలన రైతుల నష్టపోతున్నారని ఆయన అన్నారు.తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ధాన్యం రాశులు సైతం నీట మునికి అన్నధాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు.రైతులు,కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక ఇబ్బదులు పడుతున్నారని,ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలు చేసి ఉంటే నష్టపోయే వాళ్ళం కాదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. అంతే కాకుండా ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం ఎటువంటి షరతులు పెట్టకుండా, రంగు మారిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తొండంగి మండల టిడిపి ప్రెసిడెంట్ చొక్కా అప్పారావు, రాష్ట్ర రైతు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, మాజీ జడ్పిటిసి చొక్కా కాశీ, మాజీ ప్రెసిడెంట్ యడ్ల సూరిబాబు,మండల ఎస్సి సెల్ సెక్రటరీ పెదపూడి గవరయ్య, యేశీబు, జనసేన మండల ఉపాధ్యక్షులు కండవల్లి గణేష్, మండల టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!