తునిలో ఘనంగా ‘మీ ఇంటికి మీ దివ్య’ కార్యక్రమం


తెలుగుదేశం పార్టీ తుని అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జ్ యనమల దివ్య ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మీ ఇంటికి మీ దివ్య’ కార్యక్రమం నియోజక వర్గంలో విశేష ప్రజాధరణ పొంది నిరంతరం ప్రజల మధ్యన విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం తుని పట్టణం లోని పదహారవ వార్డులో ‘మీ ఇంటికి మీ దివ్య’ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గ టీడీపీఇంచార్జ్ యనమల దివ్య హాజరయ్యారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హారతులతో ఘన స్వాగతం పలికారు.వార్డులో ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల మ్యానిపేస్టో కరపత్రాలను ప్రజలకు అందచేసి వాటిని గూర్చి వివరించారు.అడుగడుగునా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని యనమల దివ్యకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని,నాయకులు,కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. నియోజక వర్గంలో అనేక ప్రజాసమస్యలున్నాయని,ప్రస్తుత ప్రభుత్వ పాలకులు వాటిని, ప్రజలను విస్మరించారని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజక వర్గ సమన్వయ కర్త చోడిశెట్టి గణేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్, టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ , జనసేన పార్టీ నాయకులు పల్లెల లోవరాజు, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి మళ్ల గణేష్, జనసేన నాయకులు గెడ్డమూరి సురేష్, ,కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగ ప్రెసిడెంట్ కుక్కడపు బాలాజీ, జనసేన నాయకులు అద్దేపల్లి బాలాజీ, సలాది ఉదయ భాస్కర్,అల్లు రాజు, కనిగిరి ప్రకాష్, కిల్లాడ గిరి, గొర్ల నూకరాజు,వాడపల్లి రాము, కురందాసు రమేష్, కోడూరి సురేష్, ఇసరపు సత్తిబాబు, నక్కా ఆనందరావు, లట్టల నాగేశ్వరరావు,శ్రీను, శ్రీనివాస్ రాజు, రాంబాబు రాజు, కుండల పెదబాబు, మీలా కొండబాబు, తాటిక నారాయణరావు, చందక గురుమూర్తి, ఉప్పలపాటి సీతారామరాజు, తోలేం ప్రసాద్, శిల్పరశెట్టి జగన్ మోహన్,మొగశాల శ్రీను, తటవర్తి రాజా, మేడిశెట్టి రమణ, కొల్లుబోయిన కృష్ణ, కర్రీ శివ, మామిడి దాసు, పల్లెల నాగేశ్వరావు, కంకిపాటి లోవరాజు, గట్టి శివ, కనిగిరి ప్రకాష్, శివ, రాజు, జనసేన వీరమహిళ చిన్నారి,పట్టణ టీడీపీ నాయకులు,పట్టణ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!