
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మక కార్యక్రమం యువగళం నవశకం సభ బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో జరగనుంది. ఈ సభ కు తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండడంతో యావత్ ఆంధ్ర ప్రదేశ్ చూపు ఈ సభ పై పడింది. ఈ సభకు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ లోకవరపు బాబులు నాయుడు, మాజీ ఎంపీటీసీ మాకిరెడ్డి నాని ల ఆధ్వర్యంలో నల్లబెల్లి దేముడు నాయుడు, బాబులు, సత్తిబాబు, రవి,వేకునాయుడు,అప్పలనర్సిమూర్తి, రమణ,కార్యకర్తలు, అభిమానులు పోలిపల్లికి కార్లలో బయలుదేరారు.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి

