తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య అన్నారు. ‘మీ ఇంటికి మీ దివ్య’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ తుని పట్టణంలోని 19 వ వార్డు మొండి వీధిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడుతో కలిసి పర్యటించారు. తెలుగుదేశం పార్టీ,జనసేన కార్యకర్తలతో కలిసి పర్యటించిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆమె భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి మినీ మానిఫెస్టో ను గూర్చి వివరించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమితో వైకాపాలో వణుకు పుడుతుంది అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనరంజక పథకాల కోసం ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీలను గెలిపించాలని కోరారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర యావత్తు మార్పు కోరుతున్నారని.. వైసీపీ ని సాగనంపి తెలుగుదేశం జనసేన పార్టీలకు పట్టం కట్టేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం జనసేన పార్టీల సారధి మోతుకూరి వెంకటేష్, ఎస్. ఎల్. రాజు, జనసేన సమన్వయ కర్త చొడిశెట్టి గణేష్, కుక్కడపు బాలాజీ, చింతంనీడి అబ్బాయి, మళ్ళ గణేష్, దిబ్బ శ్రీను, శిల్పరశెట్టి జగన్ మోహన్, మామిడి దాసు, అల్లు రాజు,లంక సునీల్,చిరంజీవి రాజు, గజ్జి రాంబాబు,స్థానిక నాయకులు చల్లకొండ రమేష్, చల్లకొండ రాజా, నుకలా రమేష్, అళ్ళ దుర్గా ప్రసాద్,హిమంతి ఉదయ్ భాస్కర్, పలమరశెట్టి శివాజీ, మహతరపు బాబూరావు, జనసేన నాయకులు గెడ్డమూరి సురేష్ మరియు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ANDHRA BREAKING NEWS NEWS PAPER STATE

