కోటనందూరు మండలం బిళ్ళనందూరు గ్రామంలో తెలుగుదేశంపార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం’బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా టిడిపి మండల అధ్యక్షులు గాడి రాజబాబు,మండల ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు భావితరాల భవిష్యత్తుకు చాలా అవసరమని ఆయన అన్నారు.

వైసిపి పాలనలో అనేక అరాచకాలు, దాడులు,దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాకుండా భవన నిర్మాణ రంగంలో ఇసుక కొరతను సృష్టించి అధిక రేట్లకు అమ్ముకుంటూ కోట్ల సొమ్మును దోచేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రోడ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆయన అన్నారు.నియోజకవర్గం లో అనేక సమస్యలున్నా వాటిని గాలికి వదిలేశారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని సాగనంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని భాస్కర్ అన్నారు. అందుకోసం ప్రతీ కార్యకర్త తెలుగు దేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANDHRA BREAKING NEWS NEWS PAPER POLITICS STATE

