ప్రజలకు నిస్వార్ధమైన సేవకులు దైవజనులు పాస్టర్లు.
యనమల దివ్య టిడిపి ఇన్చార్జ్ తుని.
కోటనందూరు (అఖండ భూమి) ప్రజలకు విశ్వార్థమైన సేవలు అందించేవారు దైవజనులు పాస్టర్లు అని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా, తునిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడితో కలిసి తునిలో పనిచేస్తున్న దైవ సేవకులకు క్రిస్టమస్ సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసుక్రీస్తు చేసిన బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, శాంతి,కరుణ, ప్రేమ ప్రతి ఒక్కరు కలిగి జీవించాలని, ఏసుక్రీస్తు జన్మదిన ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఆరాధనగా జరుపుకుంటారని, దైవజనులకు ఎన్ని కష్టములు ఉన్నా బయటకు కష్టాలు లేని వ్యక్తిగా ఉంటూ ప్రజలకు సేవలు చేస్తూ ఏసుక్రీస్తు బోధనలు వివరిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణణ్,మోటుకూరి వెంకటేష్, మళ్ల గణేష్, కుక్కడపు బాలాజీ, దిబ్బ శ్రీను, పాస్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..