వేపాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఆర్ సిఎం దేవాలయానికి తరలివచ్చిన క్రైస్తవులు
రెవ.ఫా.బి బాలరాజు ప్రత్యేక ప్రార్థనలు
వేపాడ డిసెంబర్ 24(అఖండ భూమి):- మండల కేంద్రం వేపాడ ఆర్ సిఎం దేవాలయంలో ఆదివారం రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవుల సహాయ మాత దేవాలయంలోవిచారణ కర్తలు రెవ.ఫా.బి జయరాజు సారథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చిలో 24గంటల పాటు జరగనున్న ప్రార్థనల్లో మండలంలోని వేపాడ, వల్లంపూడి, బల్లంకి, వీలుపర్తి, రాయుడుపేట, డబ్బిరాజుపేట, నీలకంఠరాజపురం, సింగరాయి, పెద గుడిపాల తదితర గ్రామాల నుంచి క్రైస్తవసోదర సోదరీ మణులు అధికసంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు. అలాగే బల్లంకి, బానాది, జాకేరు, సోంపురం, అరిగిపాలెం, వీలుపర్తి, బొద్దాం, దబ్బిరాజుపేట, వావీలపాడు, నల్లబిల్లి తదితర గ్రామాలలో గల చర్చిలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేపాడ ఆర్సీఎం చర్చిలో విచారణ సంఘం సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం


