అద్భుతంగా జగనన్న కాలనీల నిర్మాణం

 

 

అద్భుతంగా జగనన్న కాలనీల నిర్మాణం

లబ్ధిదారుల సొంతింటి కల సాకారం

అమలుకు నోచుకోని అంతర్గత సౌకర్యాలు

వేపాడ డిసెంబర్ 24(అఖండ భూమి):- మండలంలో జగనన్న కాలనీల నిర్మాణం అద్భుతంగా జరుగుతోంది. జగనన్న కాలనీ ఇళ్లు మంజూరు చేసిన ప్రతి చోట ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయగా ఇంకా చాలా మంది లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాన్ని వివిధ దశల్లో తీసుకు వచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం వేగంగా జరిపే అవకాశం లేక అంచెలంచెలుగా నిర్మించుకుంటున్నారు. ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్న లబ్దిదారులు ఇళ్ల నిర్మాణంను శరవేగంగా పూర్తి చేయడమే కాకుండా గృహ ప్రవేశాలు కూడా జరిపారు. అలాగే ప్రభుత్వం ఇళ్ల బిల్లుల మంజూరులో జాప్యం చేయటం వల్ల కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే అవకాశం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా జగనన్న కాలనీల్లో సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించి మిగిలిన సౌకర్యాలు కల్పించడంలో వెనుకడుగు వేసింది. మొత్తం మీద రెండు నెలలు లోగా జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ లోగా ప్రభుత్వం కల్పిస్తామన్న సౌకర్యాలన్నీ పూర్తి చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. అలాగే పెండింగ్ బిల్లులు కూడా వెంటనే మంజూరు చేసి లబ్దిదారులకు అండగా నిలిస్తే త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

ఫొటో 1:-

Akhand Bhoomi News

error: Content is protected !!