ఆతవ రోడ్డు అంతేనా?
పిక్క వేశారు – తారు రోడ్డు మరిచారు!
చిద్రమైపోతున్నరోడ్డుతోఅవస్థలు పడుతున్న ప్రజలు
వేపాడ డిసెంబర్ 24(అఖండ భూమి):- మండలంలోని ఆతవ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. సుమారుగా పదేళ్ల క్రితం ఈతారు రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్డు పునర్నిర్మాణం జరగలేదు. నాటి టిడిపి పాలకులు గాని నేటి వైసీపీ పాలకులు మొన్నటి వరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. గ్రామ సర్పంచ్ గొంప వేమన రాము, గ్రామ పెద్దలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్పందించారు. తారు రోడ్డు నిర్మాణానికి అవసరమైన కల్వర్తుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. టెండర్ వేయగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎమ్మెల్యే ఒత్తిడితో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాంతో ఆతవ గ్రామస్తులు ఇకపై కష్టాలు తీరినట్లేనని భావించారు. సంబంధిత కాంట్రాక్టర్ పిక్కతో రెండు లేయర్ల రోడ్డును నిర్మించారు. ఇక తారు రోడ్డు నిర్మించడమే తరువాయి అని అంతా ఆనందం వ్యక్తం చేశారు. పిక్కతో రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ నేటికీ తారు రోడ్డు నిర్మించక పోవడంతో పిక్క రేగిపోయి రోడ్డంతా చిద్రమై ప్రజల అవస్థలు మళ్లీ మొదటి కే వచ్చాయి. సుమారు మూడు నెలలుగా ఇదే పరిస్థితి దాపురించినప్పటికీ ఇటు ఎమ్మెల్యే గాని అటు ఇటు కాంట్రాక్టర్ గాని పట్టించుకోక పోవడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. రోడ్డు నిర్మాణం ఎందుకు ఆగింది, ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది అర్దం కాక తీవ్రంగా సతమత మవుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..