ఎంపీపీ గుమ్మ పద్మజ యల్లేష్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది..!
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల డిసెంబర్ 30:(అఖండ భూమి) శనివారం గుమ్మ పద్మజా యల్లేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు పనిచేయాలని దోర్నాల ఎంపిపి గుమ్మ పద్మజ యల్లేష్ అన్నారు. దోర్నాలలోని స్థానిక విద్య వనరుల కేంద్రం నందు శనివారం ఎంపీపీ గుమ్మ పద్మజ యల్లేష్ అధ్యక్షతన ఎం పి డి ఓ నాసర్ రెడ్డి, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి గుమ్మ పద్మజ యల్లేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరేలా అధికారులు పనిచేయాలన్నారు. మండలంలో పలుచోట్ల రేషన్ సరిగ్గా అందడం లేదని అలాగే పలు గ్రామాల్లో నీటి సమస్య అధికంగా ఉందని అధికారులు వాటిపై దృష్టి పెట్టి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే పలువురు అధికారులు సమావేశానికి రాకపోవడంతో తదుపరి సర్వసభ్య సమావేశాన్ని కి తప్పకుండా హాజరవ్వాలని లేనియెడల వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు వైస్ ఎంపీపీలు పరుచూరి సురేఖ, సీతారామయ్య, దర్శనం నాగయ్య, కో ఆప్షన్ నెంబర్ వహాబ్ ఖాన్, తాసిల్దార్ వేణుగోపాల్ రావు, ఎం ఈ ఓ మస్తాన్ నాయక్, ప్రభుత్వ వైద్యశాల సూపర్నెంటు భాస్కర్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



