నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పోలీస్ నిబంధనలను తప్పక పాటించాలని వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై శంకర్ అన్నారు. ఆదివారం కోటనందూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాత్రి 12:30 గంటల వరకు మాత్రమే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని, సెక్షన్ 30 అమలులోఉంటుందని ఆయన అన్నారు.
నిబంధనలను అతిక్రమించి మద్యం మత్తులో అల్లర్లు సృష్టించినా, గొడవలు చేసినా, వ్యక్తులు గుమిగూడినా, పెద్ద శబ్దాలతో వాహనాలను నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


