మెరుగైన జీవన ప్రమాణాల కోసం – ‘వాయిస్ ఫర్ గర్ల్స్’ సంస్థ

 

విద్యార్థినుల మెరుగైన భవిష్యత్తు, జీవన ప్రమాణాలు సాధికారత లక్ష్యంగా ‘హర్ వాయిస్ పరిఛయ్’ అనే కార్యక్రమాన్ని రూపొందించినట్లు ‘వాయిస్ ఫర్ గర్ల్స్’ సంస్థ డైరెక్టర్ అనూష భరద్వాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వాయిస్ ఫర్ గర్ల్స్ మొదటి దశలో ‘హర్ వాయిస్ పరిఛయ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌమార దశ బాలికలకు వివిధ అంశాలను పరిచయం చేస్తుందని అన్నారు.

అంతేకాకుండా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా సామాజికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త సామర్ధ్యాలని పెంపొందించుకుంటూ కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొనే దశ కౌమారదశ అని ఆయన అన్నారు. శుక్రవారం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక శిబిరం ను ఏర్పాటు చేశారు. ఇందులో కౌమార దశలోని బాలికల సాధికారత కోసం పాఠశాల విద్యార్ధినిలకు క్లిష్టమైన జ్ఞానం, ఆరోగ్యం, హింస నుండి భద్రత,జీవన ప్రమాణాలు మెరుగుదల, ప్రాథమిక హక్కులు,కమ్యూనికేషన్ స్కిల్, భవిష్యత్తుపై బాధ్యత కల్పించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సరైన జ్ఞానమును, నైపుణ్యాలను అందించినప్పుడు బాలికలు తమ జీవితాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా,తమ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా అద్భుతంగా మార్చగలరని వాయిస్ ఫర్ గర్ల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూష భరద్వాజ్ వివరించారు. క్యాంపులో పాల్గొన్న విద్యార్థిని మౌనిక మాట్లాడుతూ ఈ క్యాంపులో పాల్గొనడం వల్ల ఎన్నో విషయాలను తెలుసుకోగలిగామని తెలిపింది.ఈ క్యాంపు పట్ల పలువురు విద్యార్ధినిలు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను, పౌష్టిక ఆహారం యొక్క ప్రాముఖ్యతను, ప్రాథమిక హక్కులను తెలుసుకోగలిగామని తెలిపారు. ఈ సదస్సులో వార్డెన్ దీప, విద్యార్థినులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!