ఆదోని 1 వ పట్టణ సీఐ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన BV విక్రమ సింహ

ఆదోని 1 వ పట్టణ సీఐ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన BV విక్రమ సింహ

 

..2021 లో కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ లో సీఐ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో SEB దాడుల్లో పట్టుబడ్డ 105 కేజీల వెండి ను తన తరువాత బాధ్యతలు స్వీకరించిన అధికారికి రాతపూర్వకంగా అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారని పోలీసు శాఖ సింహను ఇటీవలే సస్పెండ్ చేసింది.. శాఖ పరమైన విచారణ అనంతరం విక్రమ సింహ తప్పు లేదని విచారణ లో తేలడంతో పోలీసు శాఖ అతని పై వేసిన సస్పెన్షన్ ను ఎత్తి వేస్తూ తిరిగి ఆదోని 1 టౌన్ కే సీఐ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది…105 కేజీల వెండి పోలీసు స్టేషన్ నుండి దొంగిలించిన మహిళ హెడ్ కానిస్టేబుల్ అమరావతి తో పాటు కానిస్టేబుల్ మరియు ఇద్దరు వ్యక్తుల నుండి దొంగలించబడ్డ వెండిని అప్పటి ఎస్పీ సిద్దార్ట్ కౌశల్ స్వాధీనం చేసుకుని సదరు ముద్దాయిలను జైలుకు పంపిన విషయం తెల్సిందే… ఏది ఏమైనా జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్న విక్రమ సింహ పై వేసిన సస్పెన్షన్ ఎత్తి వేస్తూ తిరిగి అదే స్టేషన్ కు పోస్టింగ్ ఇవ్వడం పట్ల పలువురు ప్రముఖులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు… ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తరపున విక్రమ సింహ కు పోలీసు సేవ పతకం కూడా రావడం జరిగింది….

Akhand Bhoomi News

error: Content is protected !!