ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే రైస్ మిల్లులను సీజ్ చేస్తాం 

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే రైస్ మిల్లులను సీజ్ చేస్తాం

– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

భీమవరం మే 4 అఖండ భూమి

ప్రస్తుత వాతావరణ పరిస్థితు లలో రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు.

 

గురువారం గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను జిల్లా కలెక్టరు ఆకస్మి కంగా తనిఖీ చేశారు.ఇంత వరకు ఎంత మంది రైతులు వచ్చారు , ఎంత ధాన్యం కొనుగోలు చేశారని కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. రిజిష్టర్లు ,తేమ శాతం చూసే మిషన్ , కాటా, స్టాక్ రూమ్ లను జిల్లా కలెక్టరు పరిశీలించి అధికారు లకు ,సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.రైస్ మిల్లులు నుండి ఏమైనా సమస్యలు ఎదురు అయితే వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించే రైస్ మిల్లులను సీజ్ చెయ్యాలని జిల్లా కలెక్టరు అధికారులకు ఆదేశించారు. ఎక్కడా ధాన్యం కొనుగోలుకు అంతరాయం లేకుండా చూడాలని ఆమె అన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,రైతులు మిల్లర్ల వద్దకు వెళ్ళవల్సిన అవసరం లేదని కలెక్టరు అన్నారు.రైతులు ఆందోళన చెందవద్దని మీరు పండించిన ప్రతి ధాన్యాపు గింజను కొనుగోలు చేస్తామని ,రైస్ మిల్లుల వద్దకు వెళ్ళనవసరం లేదని రైతులకు కలెక్టరు బరోసా నిచ్చారు. ధాన్యం కొనుగోలు సమయంలో ఏ రైతు కైనా సమస్య ఎదురైతే సంబంధిత రైతు భరోసా కేంద్రం లేదా, మండల వ్యవ సాయాధికారి, తహశీల్దారు దృష్టికి తీసుకు రావాలన్నారు. రవాణాకు లారీలు ,గోనె సంచుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకు న్నామని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు.జిల్లా కలెక్టరు వెంట తహశీల్దారు పి.లక్ష్మి, ,యం పి డి వో జి. జ్యోతిర్మయి , వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదు ,రైతులు, ఆర్ బి కె సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!