పాడేరు అసెంబ్లీ లో మత్యరాస విశ్వేశ్వర రాజు గెలుపు తథ్యం
- నేడు పాడేరు లో కార్యక్రమం ప్రారంభం
- భారీజనసముహంతో బైక్ ర్యాలీ
- ముఖ్య అతిథిగా రాజ్య సభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి
కొయ్యూరు అఖండ భూమిఫి బ్రవరి 23 అల్లూరి జిల్లా
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం లో వైసిపి అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు గెలుపు తగ్గిమని కొయ్యూరు పిఎసిఎస్ చైర్మన్ బాబు ఆసా భావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకుని మత్స్యరాస విశ్వేశ్వరరాజు ను ఎంపిక చేయడంతోనే గెలుపు ముంగిట నిల్చామని దీంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైందని ఆయన అన్నారు విశ్వేశ్వర రాజు సౌమ్యుడు అందరిని కలుపుకొని వెళ్లే నిస్వార్థపరుడు కావడంతో పాడేరు నియోజకవర్గం లో ఐదు మండలాల్లో ఎక్కడ పర్యటించిన విశ్వేశ్వర రాజుకు బ్రహ్మరథం పడుతున్నారు
నేడు భారీ ఎత్తున బైకు ర్యాలీ
పాడేరు అసెంబ్లీ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు నియోజకవర్గ కేంద్రమైన పాడేరులో వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాలైన రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హాజరవుతున్నందున నియోజకవర్గంలో ఉన్న వైసీపీ పార్టీలో పదవులను అలంకరిస్తున్న అందరూ సానుభూతిపరులు పార్టీ కార్యకర్తలు విధిగా హాజరై బైక్ ర్యాలీతోపాటు సమావేశంలో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ సుమ్మర్ల సూరిబాబు తెలిపారు
జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించిన పి ఎస్ ఎస్ చైర్మన్ సుమ్మర్ల సూరిబాబు ప్రసంగం
గత తెలుగుదేశం ప్రభుత్వం హాయములో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతం అయినా చింతపల్లి కేంద్రము లో బాక్సైటుకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో అప్పటి మారుమూల పంచాయతీ అయినా బుధ రాళ్ల నుండి పంచాయతీ సర్పంచిగా ఎన్నికై చింతపల్లిలో జరిగిన బహిరంగ సమావేశంలో బాప్చేట్ పై గిరిజనులపై ప్రసంగించడంతో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కూడా పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
నేడు జరిగే బహిరంగ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలి
పాడేరు నియోజకవర్గం కేంద్రమైన పాడేరులో వైసిపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి పార్టీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు అందరికీ భారీ ఎత్తున స్వాగతం పలకాలని ఆయనే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు



