అంగరంగవైభవంగాసుబ్రహ్మణ్యస్వామి అభయాంజనేయ తీర్థ మహోత్సవాలు 

 

 

అంగరంగవైభవంగాసుబ్రహ్మణ్యస్వామి

అభయాంజనేయ తీర్థ మహోత్సవాలు

మూడురోజులపాటుఅలరించిన పలుసాంస్కృతికప్రదర్శనలు

ఉత్సాహంగా సాగిన ఎడ్ల బండ్లపరుగు పందాలు

వేపాడ ఫిబ్రవరి 23(అఖండ భూమి):- మండలంలోని చామలాపల్లి గ్రామాలలో ఈనెల 21,22, 23తేదీలలో మూడు రోజుల పాటు శ్రీ సంతాన కుమార సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.21న భక్త పారవస్యంగా గణపతి పూజ, దేవరాపల్లి వారిచే మహిళా కోలాటం కార్యక్రమాలు అద్భుతంగా సాగాయి.22న నూతనంగా నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ, యజ్ఞ యాగాదులు భక్తి శ్రద్ధలతోవేద మంత్రాల సాక్షిగా నిర్వహించారు. ఈ సంధర్భంగా అదే రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి భారీ స్థాయిలో అన్నసమారాధన ఏర్పాటు చేయగా పలు గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. అదే రోజు రాత్రి 9గంటల నుంచి ఆనందపురం వారిచే బుర్రకథ కడురమ్యంగా ప్రదర్శించారు. అలాగే గ్రామ సర్పంచ్ కోలా సతీష్,పలువురు గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో నిర్వహించిన ఈ ప్రథమ తీర్ధ మహోత్సవాలలో భాగంగా మూడో రోజు తీర్ధ మహోత్సవం సంధర్భంగా సాయంత్రం 4గంటల నుంచి ఎడ్ల బండ్ల పరుగు పందాలు అత్యంత ఉత్సాహంగా జరిపారు. అలాగే రాత్రి 9గంటల నుంచి విశాఖకు చెందిన బాలు రైడర్స్ వారిచే ప్రదర్శించిన డాన్స్ బేబీ డాన్స్ నృత్య ప్రదర్శనలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. డీసీసీబీ చైర్మన్ వేచలపు వేంకట చిన రాము నాయుడు పర్య వేక్షణలో ఉత్సాహంగా సాగిన ఎడ్ల బండ్ల పరుగు పందెం నిర్వహణలో వైస్ ఎంపీపీ అడపా ఈశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు టీవీ రమణ, ఆకుల సత్యనారాయణ, కుంచి కోటేశ్వరరావు, చప్పగడ్డిరమణ, దుల్ల రమణ, దుల్ల అప్పన్న, షేక్ రెహమాన్, చప్పగడ్డి జగన్, కోలా రమేష్, సలాది సూరయ్య, అడపా బాలకృష్ణ, అడపా వెంకటసూరి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!