వంతల రాణి కుటుంబానికి న్యాయం చేయండి

 

వంతల రాణి కుటుంబానికి న్యాయం చేయండి

గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ.

ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వి కృష్ణ

కుటుంబ సభ్యులు డిమాండ్.

కొయ్యూరు అఖండ భూమిఫి బ్రవరి 23 అల్లూరు జిల్లా

గత నెల జనవరి సంక్రాంతి సెలవులు ముందు కేజీబీవీ కస్తూరి గాంధీని స్కూల్ నందు చదువుతున్న వంతల రాణి 8వ, తరగతి చదువుతూ చర్మవ్యాధి ఒళ్లంతా వాపుతో అనారోగ్యానికి గురి కావడం పరిస్థితి విషమించడంతో సంక్రాంతి సెలవులకు మూడు రోజుల ముందు 6/01/ 2024. తల్లితండ్రులైన వంతల సుబ్బారావు, మంగమ్మలకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. మీ పిల్ల ఆరోగ్య పరిస్థితి బాగోలేదు మీరు ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పడంతో అదే రోజు మా పాపకు ఇంటికి తీసుకువెళ్లి పోవడం జరిగింది. ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత పరిస్థితి విషమించడంతో పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్య నిమిత్తం తీసుకోరడం ,. మళ్లీ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి తీసుకువెళ్లగా, రెండు మూడు రోజుల తర్వాత ముక్కు నుండి నోరు నుండి రక్తం కారుతూ గట్టి గట్టిగా ఏడుస్తూ పిడ్స్ వచ్చినట్లుగా పడిపోయి జనవరి 18 /01 2024 రాత్రి 9 గంటల సమయంలో రాణి మృతి చెందింది.అయితే ఈ విషయం వెలుగులోకి రానివ్వకుండా, వంతల రాణి మృతి చెందిన విషయం తెలుసుకొని స్కూల్ సిబ్బంది. విద్యార్థినిమృతి చెందిన గుపిగడ్డ గ్రామం జిమాడుగుల మండలానికి చేరుకొని, కుటుంబ సభ్యులను ఓదారుస్తూ , రాణి చనిపోవడం చాలా బాధాకరం. మీ కుటుంబానికి అన్ని విధాలాగా ఆదుకుంటాం స్కూల్ తరఫున నుండి దాన సంస్కరణలకు మరియు పెద్దకర్మకు స్కూల్ తరఫున ఆర్థిక సహకారం అందిస్తామని ,మాయ మాటలు చెప్పి అంతిమ సంస్కారాలు చేపించారు ఆ తర్వాత నుండి స్కూల్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడం , పరిహారం ఇవ్వకపోవడం తో , ఈరోజు అల్లూరి జిల్లా డీఈఓ గారికి ఫిర్యాదు చేయడానికి పాడేరు పి ఎమ్ ఆర్ సి లో రావడం జరిగింది .

 

విద్యార్థి మృతి పట్ల నిర్లక్ష్యం వహించిన జి.మాడుగుల కేజీబీవీ స్కూల్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ,మాయ మాటలు చెప్పి బాధితులకు పరిహారం అందిస్తామని , నేటికీ పరిహారమందచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిమాడుగుల కేజీబీవీ స్కూల్ స్కూల్ యజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పాడేరు ఐ టి డి ఏ పీవో గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వి కృష్ణారావు దాస్ జగదీష్ మరియు కుటుంబ సభ్యులు శ్రీకాంత్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!