ఉదయ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.

 

 

 

ఉదయ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.

ప్రముఖ వైద్యులు ఈటె ఉదయ్

ఎటపాక, ఫిబ్రవరి 23 (అఖండ భూమి): అల్లూరి జిల్లా, ఎటపాక మండల పరిధిలోని గన్నవరం పంచాయతీ, కాపుగొంపల్లి కాలనీ నందు గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈనెల 25 తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయ్ హాస్పిటల్ భద్రాచలం జనరల్,ఎమర్జెన్సీ& ఐ.సి.యు కేర్ ప్రముఖ సీనియర్ వైద్యులు డా.ఈటె ఉదయ్ ఎం.బి.బి.ఎస్, డి.ఎన్.బి (జనరల్ మెడిసిన్ , జనరల్ ఫిజీషియన్ ) వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తునట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్యంతోపాటు , రక్త పరీక్షలు, షుగర్, బి.పి , మరియు గుండెకు సంబంధించి ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.వైద్య పరీక్షల అనంతరం సంబంధిత వ్యాధులకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని.కావున గన్నవరం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఉదయ్ హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!