పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. .. .సీఐ అప్పన్న.

 

 

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. .. .సీఐ అప్పన్న.

ఎస్.రాయవరం. ఫిబ్రవరి.23. అఖండ భూమి

మాఘపౌర్ణమి జాతర సందర్బంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నక్కపల్లి సీఐ అప్పన్న తెలిపారు. నర్సీపట్నం డిఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో ముగ్గురు సీఐ లు పదిమంది ఎస్ఐ లు సుమారు 100 మంది ఇతర సిబ్బంది తో బందోబస్త్ ఏర్పాటు చేశామని, సముద్ర తీరం వద్ద ముప్పై మంది గజ ఈతగాళ్ళను నియమించామని, హోం గార్డులు ఇతర వాలంటీర్లతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ జాతరకు అనకాపల్లి, నర్సీపట్నం గాజువాక డిపోలనుండి సుమారు 30 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ రవాణా సదుపాయం కల్పించగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలవరం గ్రామం దగ్గరలో గల సాయి మెరైన్ కంపెనీ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించామని కేవలం ఆర్టీసీ బస్సులను ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని,ఆటోలు, ఇతర ప్రయివేట్ బస్సులు, కార్లు తదితర వాహనాలను అడ్డురోడ్డు వద్ద గల ఆదర్శ ఆంజనేయస్వామి గుడివరకు మాత్రమే అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు. అడ్డురోడ్డు జంక్షన్ నుండి రేవుపోలవరం వరకు రహదారిపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని పోలీసులు గస్తీ నిర్వహిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అన్నారు. తీరం వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, రెవిన్యూ,వాలంటీర్ వ్యవస్థతో పాటుగా ఇతర సిబ్బంది సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!