పీఎం జన్ మాన్ గృహాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు
గూడెం కొత్తవీధి,( అఖండ భూమి) ఫిబ్రవరి23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం రింతాడ పంచాయతీలో పీఎం జన్ మాన్ పథకం ద్వారా మంజూరై నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను జీకే వీధి గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ సెగ్గే సూరిబాబు వర్క్ ఇన్స్పెక్టర్ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఎం జన్ మన్ ద్వారా మంజూరైన గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్మాణాలు పూర్తయితే ఎక్కడి వరకు నిర్మాణాలు పూర్తి చేశారో అక్కడి వరకు ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేయటం జరుగుతుందని,ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు గిరీష్,చిట్టి పడాల్ పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



