ఈ ఎన్నికల్లో సండే ఎమ్మెల్యే ఎంత ఖర్చు చేసిన ఎంత మందితో వచ్చిన ఈ సారి నంద్యాలలో మార్పు ఖాయమే గెలిచేది ఎన్్ ఎం డి ఫరూక్  మాత్రమే -ఎన్్ ఎం డి ఫిరోజ్.

 

ఈ ఎన్నికల్లో సండే ఎమ్మెల్యే ఎంత ఖర్చు చేసిన ఎంత మందితో వచ్చిన ఈ సారి నంద్యాలలో మార్పు ఖాయమే గెలిచేది ఎన్్ ఎం డి ఫరూక్  మాత్రమే -ఎన్్ ఎం డి ఫిరోజ్.

నంద్యాల ఫిబ్రవరి 23( అఖండ భూమి)

నంద్యాల చింతారుగు వద్ద చాయ్ పే చర్చా కార్యక్రమంలో ఎన్్ ఎం డి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లకే కాదు సొంత పార్టీ కౌన్సిలర్లకు కూడ విలువ లేదన్నారు.వారు మాట్లాడితే మైకులు కట్ చేసే సంస్కృతి నంద్యాలకు వచ్చిందన్నారు.

నంద్యాల ప్రజలు ఈ ఎమ్మెల్యేకు పెట్టిన పేరు సండే ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే కేవలం నంద్యాలకు ఆదివారం వస్తాడని వచ్చి తిరిగి సాయంత్రమే వెళ్లిపోతాడాని అన్నారు.

ఈ ఎమ్మెల్యే కేవలం నంద్యాలలో మెడీయేషన్ కమిషన్ వ్యాపారం చేస్తున్నారన్నారు.

నంద్యాల ప్రజలు ఈసారి ఈ సండే ఎమ్మెల్యే ని ఓడగోడుతున్నారని తెలిసి మా తెలుగుదేశం కార్యకర్తలకు డబ్బు ప్రలోభాలు పెట్టి గెలవాలని కుట్రలు పన్నుతున్నారు.

నంద్యాల కోసం ఈ ఎమ్మెల్యే కుటుంబం ఒక్క సేంట్ ఇవ్వలేదని తెలిపారు, పట్టణంలోని ప్రభుత్వ షాపులను లీజు చేసుకుని నంద్యాల వ్యాపారస్తులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.

జగన్ సిద్ధం అని సభలు పెట్టి జర్నలిస్టుల పై, ఈనాడు కార్యాలయల పై దాడులు చేస్తున్నారన్నారు.

ఓటమికి భయపడి వాలంటీర్లను ఉపయోగించి రేషన్ కార్డులు పెన్షన్స్ అంటూ భయపెడుతున్నారని ఎన్నికల కోడ్ వచ్చాక వీరి ఆగడాలు జరగవని తెలియజేశారు. వీరికి వేలకు వేలు ఆశ చూపి పార్టీ ప్రచారం చేయించుకుంటున్నారని తెలిపారు.

వైస్సార్ నగర్ లో ప్రజలకు రావాల్సిన పట్టాలను బిస్కెట్లు పంచినట్టు వైసీపీ నాయకులకు పంచుతున్నారు.టీడీపీ వారికి ఆశ చూపి ప్రలోభాలు పెడుతున్నారన్నారు.

ఈసారి రాబోయేది టీడీపీ ప్రభుత్వమే వచ్చేది ఎన్్ ఎం డి ఫరూక్ గారు మాత్రమే.. ఎంత ఖర్చు చేసిన ఎంత మందితో వచ్చిన ఈ సారి మార్పు ఖాయమే అని తెలిపారు.

యువతకు ఉద్యోగాలు లేవు, జాబ్ కావాలంటే హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.*జగన్ రాష్ట్రాన్ని అమ్మేస్తుంటే సండే ఎమ్మెల్యే నంద్యాలను అమ్మేస్తున్నాడని ధ్వజమెత్తారు.

రాబోయే నంద్యాల ఎన్నికల్లో 1 & 2వ వార్డు ప్రజలు *అత్యధిక మెజార్టీతో మన ఎన్్ ఎం డి ఫరూక్ గారిని గెలిపించుకోని నంద్యాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!