పీకిసాన్ పథకానికి అర్హులైన రైతులందరికీ ఈకేవైసీ పూర్తి చేయాలి
పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ
అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి, (అఖండ భూమి), ఫిబ్రవరి 23:పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరికీ ఈ కేవైసీ పూర్తి చేయించాలని పెదవలస సర్పంచ్ పాంగి కృష్ణవంశీ అన్నారు.శుక్రవారం పెదవలస రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఈ కేవైసీ చేస్తున్న విధానాన్ని మండల వ్యవసాయ అధికారి టి. మధుసూదన్ రావు తో కలిసి సర్పంచ్ పరిశీలించారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ కేవైసీ పూర్తి చేయాలని,రైతులు అగ్రికల్చర్ అసిస్టెంట్లకు సహకరించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మధుసూదన్ రావు, అగ్రికల్చర్ అసిస్టెంట్ రవీంద్ర, వీఆర్వో గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



