పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన సదస్సు….

 

 

పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన సదస్సు….

ఎస్ రాయవరం మండలం ఫిబ్రవరి 23 న్యూస్ అఖండ భూమి మండల కేంద్రంలో దార్లపూడి గ్రామంలో

జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి హేమంత్ మరియు జిల్లామలేరియా అధికారి వరహాల దొర ఆదేశాల మేరకు పెనుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- వైద్యాధికారి డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ దార్లపూడి గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం ను ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల నీరు నిల్వ ఉండడం వలన, పరిశుభ్రమైన నీరులో దోమ యొక్క లార్వా నీటిలో గుడ్డు పెడుతుంది మనం వాడుతున్నటువంటి నీటి మీద డ్రమ్ముల్లో మూతలు క్రమం తప్పకుండా పెట్టుకోవాలి,ఎన్ వి బి డి సి పి నేషనల్ వెక్టార్ బాండు డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ ఆడ ఎడిసి ఈజిప్టు టైగర్ దోమ ద్వారా డెంగ్యూ, చికెన్ గునియా జ్వరం బారిన పడతారు.గున్యా వీటిని నివారించడానికి ముఖ్యంగా మూడు మూడు పద్ధతులు ఒకటి దోమ పుట్ట కుండ అదుపు చేయడం, రెండు దోమలు కుట్టకుండా చూసుకోవడం, మూడు దోమకాటు గురైతే సరైన మందులు తీసుకోవడం అని డాక్టర్ రాజశ్రీ చెప్పడం జరిగింది. హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆరోగ్య పర్యవేక్షకులు సత్తిబాబు మీడియా తో మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ వివరంగా కొన్ని ముఖ్య విషయాలు తెలియజేస్తూ దోమలు నిలవ ఉన్న నీటిలోనే గుడ్లు పెడతాయి ఈ గుడ్లు సుమారు 8 నుండి పది రోజుల్లో పెద్ద దోమలుగా పెరుగుతాయి మనం నాశనం చేయలేము కనుక వారానికి ఒకసారి అంటే ప్రతి శుక్రవారం నెలలో 4నాలుగు శుక్రవారం లు నీటిని పారబోయడం ద్వారా దోమల పెరుగుదలని అరికట్టవచ్చు నీటిలో ఉన్నప్పుడే అరికట్టవచ్చు దోమలు పుట్టరాదు దోమలు కుట్టరాదు ఇంటి కిటికీలకు తలుపులు దగ్గర లెట్రిన్ వెంట పైపులకు మెస్ వైర్లు ఏర్పాటు చేసుకోవాలి ,దోమ కాటుకు గురికాకుండా నిద్రించేటప్పుడు దోమతెరలు వాడాలి, సాయంత్రం ఐదు నుండి 6 గంటల సమయంలో తలుపులు కిటికీలు మూసివేయాలి వేపాకుల పొగను వాటికి చూపించాలి, పొడవాటి చేతులు కలిగిన శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండేలా లేతరంగ దుస్తులు ధరించడం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే లో తట్టు ప్రాంతాలు లేకుండా చూడటం త్రాగునీరు నీళ్లపై మూతలు ఉంచడం వాడికిలో లేని కంటైనర్లను బోర్లించి ఉంచడం వారానికి ఒకసారి నిల్వనీటిని పారబోసి శుభ్రపరిచి ఎండలో ఉంచి మరల నింపుకోవాలి. ఒకవేళ నీరు అవసరం అనుకుంటే ఒక శుభ్రమైన గుడ్డతో వేరొక పరిశుభ్రమైన పాత్రలోనికి వడబోయే వలెను నీటి తొట్టెలను నీటి ట్యాంకులను శుభ్రంగా చేసుకోవడం మురికి నీటి నిలవడం,మురికి కాలువలో వారానికి ఒకసారి వేస్ట్ ఆయిల్ కిరోసిన్ గాని ఇంజన్ ఆయిల్ గాని పెట్రోల్ గాని వేయాలి అని చెప్పారు, ఇంటి పరిసరాలలో పనికిరాని పగిలిపోయిన వాడని వస్తువులు తాగేసిన కొబ్బరి బొండాలు టీ కప్పులు పాత టైర్లు మొదలైనవి లేకుండా చూసుకోవాలి వర్షపు నీరు నిలవ ఉండకుండా చూడాలి, గుడ్లు పెట్టే అవకాశం లేకుండా చేయాలి అంతేకాక వేపాకు పొగ వేయవచ్చు బంతి తులసి ,పుదీనా ,లవండర్ క్రోస్ వంటి మొక్కలను పెంచు కొనుట వలన వాటి నుండి వచ్చే ఘాటైన వాసనకు దోమలు ఇంటిలోనికి ప్రవేశించకుండా అరికట్టవచ్చు ఎబేట్ టి మీ పాస్ అనే డింబకు నాసినితో దోమల లార్వాను నశింపజేయు విధంగా, ముందుగా స్టాక్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. ఒక లీటరు మంచినీటిని ఒక బాటిల్ లోకి తీసుకొని దానిలో ఎబిట్ ను ను 2./. పర్సంటేజ్ కలిపి బాటిల్ బాగా షేకుచేస్తే పాలు లేదా మజ్జిగ లాగా తెల్ల రంగులోనికి మారుతుంది, దీనినే స్టాక్ సొల్యూషన్ అంటారు ,ఎక్కడైనా మీరు నీరు నిలవ ఉండి దానిలో దోమల లార్వాలను గమనిస్తే ఆ నీటి పరిమాణాన్ని బట్టి ఒక లీటర్ నీటిని 2% ఎబైటు కలిపి కాలవలో పిచికారి చేయాలి దీనివల్ల దోమలు అభివృద్ధిని నీటి దశ అక్వాటిక్ స్టేజ్ లోనే అరికట్టవచ్చు ఒకసారి తయారు చేసే స్టాక్ సొల్యూషన్ అదే రోజు ఉపయోగించాలి మరుసటి రోజు వాడరాదు ఈ విధంగా చేయడం వల్ల దోమల యొక్క వ్యాప్తిని పూర్తిగా నిరోధించవచ్చు అని హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆరోగ్య పర్యవేక్షకులు సత్తిబాబు చెప్పారు. కార్యక్రమం తదనంతరం హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఉన్నటువంటి ఏఎన్ఎం, ఆశాలు, ఎం ఎల్ హెచ్ పి,లకు ఫ్రైడే ఫ్రైడే గురించి మరియు మలేరియా డెంగ్యూ ,ఫైలేరియా, కీటక జనిత వ్యాధుల గురించి మరియు టైఫాయిడ్ వెక్టార్ బాండ్ డిసీజ్ కంట్రోల్ గురించి పూర్తిస్థాయిలో ఆరోగ్య సిబ్బంది అందరికీ, హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆరోగ్య పర్యవేక్షకులు సత్తిబాబు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పెనుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జమీయమ్మ మరియు హెచ్ ఈ శ్రీనివాస్ మరియు హెల్త్ సూపర్వైజర్ ఆదినారాయణమూ మీడియాతో మాట్లాడుత ఎప్పటికప్పుడు వర్షపు నీరు మన పరిసరాల్లో నీరు నిల్వ ఎక్కడైనా ఉంటే ఎప్పటికప్పుడు ఆ నీరును తొలగిస్తూ శుభ్రపరుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇంటి లోపల ఫ్రిడ్జ్ వెనుకాల వాటర్ ఉన్నా సరే ఎప్పటికీ అప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి అలాగే ఇంటి మేడ మీద వాటర్ ట్యాంకులు ఉంటే దానిమీద మూతలు క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోవాలి, మూతలు లేకపోతే కనుక ఆ స్వచ్ఛమైన నీరులోనే డెంగ్యూ దోమ గుడ్లు పెడుతుంది అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు, ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ నాగరత్నం , హెల్త్ సెక్రటరీ- కుమారి, ఎం ఎల్ హెచ్ పి- రేవతి , ఆశా కార్యకర్తలు మిగతా వైద్య సిబ్బంది కార్యక్రమంలోని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!