రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కుట్ర పూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట గర్జన (రాక్స్) ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ చేస్తున్న కృషికి రాష్ట్రంలోని మాలలు హర్షం వ్యక్తం చేసారు. దేశంలోని ఎస్సీ వర్గీకరణ కు గ్రీన్ సిగ్నల్ ను ఇస్తూ ఆగస్టులో సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడడంతో డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ 200 లకు పైగా గ్రామాలలో పర్యటించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఎస్సీ వర్గీకరణ కుట్రను బట్టబయలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాలలను చైతన్య పరుస్తూ వర్గీకరణను ఆపేందుకు ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఉద్యమం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో సమర్థవంతమైన నాయకుడు రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్ మాత్రమేనని తెలుపుతూ అనేకమంది దళిత నాయకులు ఆయనకు మద్దతు ప్రకటించారు. త్వరలో దేశానికే మాలల సత్తా ఏంటో చూపిస్తానని, కోటి మంది మాలలను ఏకం చేస్తాను అంటూ పాలకులకు సవాల్ చేస్తూ ఆయన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమానికి పావులు కదుపుతున్నారు. ఈ తరం యువ దళిత నాయకులు మాల జాతి హక్కుల పోరాటానికై సమర్థవంతమైన, నిస్వార్థ, బలమైన నాయకత్వం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ANDHRA BREAKING NEWS NEWS PAPER STATE