ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
అల్లూరి జిల్లా. డుంబ్రిగుడ. అక్టోబర్ 16. (అఖండ భూమి ):ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విషయంలో కూటమి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు.ఇందులో తన, మన అనేవి ఉండవని, ఇసుక ఉచితంగానే తీసుకువెళ్ళాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకువచ్చి ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊళ్ళో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్చ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు అని ఆయన స్పష్టం చేశారు.