పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు
గ్రామాల అభివృద్ధి తో దేశ అభివృద్ధి

టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు (నాని బాబు)
గొలుగొండ అనకాపల్లి జిల్లా
అక్టోబర్ 15 (అఖండ భూమి) అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మండలంలో సిహెచ్ నాగపురం చిడిగుమ్మల గొలుగొండ అమ్మపేట పంచాయితీల్లో వివిధ సిసి రోడ్లకు కూటమి నాయకులు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు (నాని బాబు) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు అయినప్పటికీ అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన అన్నారు గొలుగొండ మండలంలో వివిధ పంచాయతీలకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 11 కోట్ల రూపాయలు తో వివిధ అభివృద్ధి పనులకు పంపించడం జరిగిందని వెంటనే నిధులు మంజూరయ్య అని ఆయన తెలిపారు సిసి రోడ్లు వంటి నిర్మాణాలు చేపట్టమన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో కూటమి నాయకులు అన్నిచోట్ల విధిగా పాల్గొని చేసే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు చిటికెల సాంబ మూర్తి బిజెపి సీనియర్ నాయకులు గాదె శ్రీనివాసరావు. జోగుంపేట మాజీ సర్పంచ్ సుర్ల సీతారామమూర్తి (బాబ్జి) గొలుగొండ సర్పంచ్ కసిపెల్లి అప్పారావు ఎంపీటీసీ చేపల చినపాప తో పాటు కార్యకర్తలు పలు శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


