చెంచు గిరిజన గ్రామాలలో గ్రామీణ ఉపాధి పనులు పునర్దరించాలి…!

 

 

చెంచు గిరిజన గ్రామాలలో గ్రామీణ ఉపాధి పనులు పునర్దరించాలి…!

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి…..!

శ్రీశైలం ఫిబ్రవరి 23( అఖండ భూమి ): శ్రీశైల నియోజకవర్గం లో చెంచు , గిరిజన గ్రామాలు వారికి ఉపాధి కల్పించాలని, మౌలిక సదుపాయాలతో పాటు , ఈ వేసవికాలంలో ఉపాధి చూపించవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అలాగే వారికి త్రాగునీటిని సమస్య లేకుండా చూడాలని అల్లూరి సీతారామ చెంచు గిరిజన సంఘం కోరడం జరిగింది, గిరిజన సమస్యలపై ఐటిడిఓ పిఓ స్పందించి ఆ గ్రామాన్ని సందర్శించి వారి యొక్క, సమస్యలను అడిగి తెలుసుకుని, గిరిజనులు అభివృద్ధి చెందే కార్యక్రమాలు,, వారి కి వారికి కావలసిన చెందవలసిన ఆర్థిక పరమైన అభివృద్ధి వాళ్ళకి కలిగే ఇబ్బందులను తీర్చవలసినదిగా ప్రజలు కోరుకుంటున్నారు. శ్రీశైలంలో మండలంలో ఉన్న చెంచు గ్రామాల్లో సందర్శించి వారి ఉపాధికి చేపట్టవలసిన కార్యక్రమాలు ఏవైనా ఉంటే వారికి ఐటీడీఏ తరపున చెంచులు అభివృద్ధి కొరకై వారికి ఎండాకాలంలో ఉపాధి చూపించవలసిందిగా, కోరడమైనది. సంఘాల నాయకులు వై ఆశీర్వాదం మాట్లాడుతూ దోర్నాల చింతల మధ్య ఒక ఆటో లారీ ఢీకొనడంతో గాయపడ్డ వారికి మెరుగైన సేవలు అందువంచవలసినదిగా ఐ టి డి ఓ పిఓ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వెంటనే చర్యలు తీసుకోవాలని, గాయపడ్డ చెంచు గిరిజనులు ను ప్రభుత్వ ఆదుకోవాలని, మెరుగైన వైద్యం చేపించాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపై ఐటిడిఓపిఓ గారి వెంటనే స్పందించి, గాయపడిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, చేయవలసిందిగా, పూర్తిగా గాయపడిన వారికి రెండు లక్షలు ఆర్థిక సహాయం చేయవలసిందిగా వారి మెరుగైన వైద్యం కోసం చేయించాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఐటీడీఏ అధికారులు గిరిజనులపై చొరవ చూపి ప్రభుత్వమే ఆదుకోవాలని గిరిజన కుటుంబాలు ప్రభుత్వమే ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ని కోరుతున్నాము కొమరం భీమ్ ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం అల్లూరి సీతారామరాజు ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘాలు కోరడమైనది ఈ కార్యక్రమాల్లో సంఘ నాయకులు ఉడుముల వెంకటేశం, దాసరి అంకన్న, కొల్లమయ్య వీరన్న, ఇతరులు విజ్ఞప్తి చేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!