చిట్యాల లో శ్రీ తాత లాలు స్వామి ఉరుసు ప్రారంభం

 

 

చిట్యాల లో శ్రీ తాత లాలు స్వామి ఉరుసు ప్రారంభం

క్రిష్ణగిరి (అఖండ భూమి): మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో శ్రీ తాత లాలు స్వామి ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉరుసులో భాగంగా శుక్రవారం స్వామి వారి దర్గాలో గంధం కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం ఉరుసు మహోత్సవం ఉంటుందని, రాత్రి మా టీవీ కళాకారుల రేలారే రేలా గోపాల్ బృందం వారిచే సిని,జానపద పాటల సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 25న స్వామి వారి కిస్తీ కార్యక్రమం ఉంటుందని, ఈ ఉరుసు మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కమిటీ సభ్యులు కోరారు. స్వామి వారి ఉరుసు సందర్భంగా మూడు రోజులపాటు ఉరుసులో పాల్గొన్న భక్తులకు జంగం ఈశ్వరయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని వారు తెలిపారు. శ్రీ తాత లాలు స్వామి ఉరుసు సందర్భంగా గ్రామంలో రాష్ట స్థాయి పాలపండ్ల వృషబాల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనదలచిన యజమానులు 500 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని, విజేతలకు 60,40,30,20, 10వేల రూపాయలను బహుమతిగా అందిస్తామన్నారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని ఇందులో విజేతలకు 40,30,20,10,5 వేల రూపాయల నగదు బహుమతులు అందజేస్తామన్నారు.ఈ పోటీలో పాల్గొన దలచిన జట్ల సభ్యులు 500 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఉరుసులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి తన సిబ్బందితో బందోబస్తు చేపట్టారు.

Akhand Bhoomi News

error: Content is protected !!