గునుపూడి లో ఘనంగా శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు

నాతవరం మార్చి 4 (అఖండ భూమి)

నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అట్ట హాసంగా ఘనంగా నిర్వహించారు. అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాల నుంచి అనేక మంది భక్తులు తరలి వచ్చారు. మహిళలు కోలాట నృత్యం లో అత్యంత ప్రతిభ కనబరిచి భక్తులను అలరించారు. యువత, స్నేహితులు మరియు బంధువులతో కలిసి కేరింతలతో ఆనందోత్సవాల నడుమ సంబరాలు చేసుకున్నారు.

Akhand Bhoomi News