*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*

*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*

రైతుల సమస్యల పరిష్కారంపై ఫార్మా కంపెనీలు సానుకూలత

గత ఒప్పందాలను బుట్టదాఖలు చేసిన అరబిందో,దివీస్,పోర్టు
కంపెనీలపై తొండంగి మండలంలోని తీర గ్రామాలు బుసలు కొడుతున్నాయి.నిర్వాసితుల ప్యాకేజ్,కాలుష్య నియంత్రణ వంటి అంశాలను ఫార్మా కంపెనీలు పెడచెవిన పెట్టాయి.కాలుష్య రహిత కర్మాగారాలకు ప్రభావిత గ్రామాలు అభ్యంతరం చెప్పలేదు.అయితే
ఈప్రాంతంలో నిర్మించిన పరిశ్రమల నుంచి విషతుల్య‌ వాయువు వెలువడడం, రసాయనిక వ్యర్ధాలు సముద్రంలోకి విడుదల అవుతున్న తీరుపై కోన గ్రామాలు ఫార్మా కంపెనీల వైఖరిని తప్పుపడుతూ ఉద్యమ‌ భేరి మోగించారు.ప్రభుత్వ
విఫ్ ఆదేశాలపై అధికార యంత్రాంగం స్పందించింది.
ఈనేపధ్యంలో బుధవారం కలెక్రరేట్ లో కలెక్టర్, ఫార్మా కంపెనీలు,రైతు ప్రతినిధుల బృందంతో సంప్రదింపులు జరిపారు.సీనియర్ నేత *యనమల రాజేష్* నేతృత్వంలో రైతు ప్రతినిధి బృందం తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని కలెక్టర్ షాన్ మోహన్ కు అందజేసారు.కలెక్టర్ తో పాటు ఆర్డీవో శ్రీ రమణి, తహాశీల్ధార్ ముఖర్జీల సమక్షంలో ఫార్మా కంపెనీలు కోన గ్రామాల ప్రజల డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేసాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!