జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి…ఉప సర్పంచ్ కరక అప్పలరాజు

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి… ఉప సర్పంచ్ కరక అప్పలరాజు

“నేషనల్ ఇమ్యునైజేషన్ డే”ను పురస్కరించుకుని నాతవరంలో రామాలయం వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడి వర్కర్లు, ఆశా వర్కర్లు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కరక అప్పలరాజు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలుకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని దీనిపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. దీని వలన పిల్లలు అంగ వైకల్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం సత్యవతి, ఆశ వర్కర్ మాడెం రాజు, అంగన్వాడీ వర్కర్ లగుడు వరలక్ష్మి, చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News