అల్లిపూడి లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ…
తుని అసెంబ్లీ నియోజకవర్గం అల్లిపూడి గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడవి రాజులు బాబు పండుగ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనేకమంది భక్తులు పండగ చేసుకుని ఎండలో నడచి అలసిపోయి తిరిగి వచ్చేటప్పుడు మజ్జిగను త్రాగి దాహం తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కోటనందూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా గ్రామం లో జరిగే శ్రీ అడివి రాజుల బాబు పండుగ సందర్భంగా భక్తుల దాహం తీర్చేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అల్లిపూడి గ్రామ జన సైనికుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆశయాల తో సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు గొప్ప విలువలతో కూడినవని ఆయన అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ ప్రజా సమస్యలపై పోరాడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అభినందనలు తెలియజేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాళ్ళ దొరబాబు, వడ్లమూరి దుర్గా ప్రసాద్, దడాల కార్తిక్, ప్రసాద్, అల్లు రాజబాబు మరియు జన సైనికులు పాల్గొన్నారు.