కోటనందూరు మండలం.
అల్లిపూడి మండల ప్రాథమిక పాఠశాల ఏబిఆర్ స్కూల్ లో తుని నియోజక వర్గ శాసన సభ్యులు యనమల దివ్య ఆదేశాల మేరకు విద్యార్థి విద్యార్థినులకు స్టూడెంట్ కిట్ లను మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుల్లిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక విద్య చాలా ముఖ్యమని, నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు కు మీరే బాటలు వేయాలని ఉపాధ్యాయులను ఆయన కోరారు. అంతేకాకుండా పాఠశాల అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంకంరెడ్డి గోపి, చింతకాయల సురేష్, న్యాయవాది కొండ్రు కళ్యాణ్ మరియు గ్రామ పెద్దలు కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాడి చల్లారావు, ఉపాధ్యాయులు వరప్రసాద్, వాసు,భవిత మరియు గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్