ఆంధ్రప్రదేశ్ లో “ఎన్టీఆర్ భరోసా”అనే పేరు తో పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యింది. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ అందిస్తామంటూ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే.దీనితో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లిపూడి లో తెలుగుదేశం పార్టీ కోటనందూరు మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలకు రూ.1000 చొప్పున మరియు ఈ నెల రూ.4000 తో కలిపి రూ.7,000 పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం అర్హులకు అందిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


