ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి పర్యటన.
ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలంలోని పలు గ్రామాలలో గురువారం జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు పర్యటించి పారిశుధ్యం, వాటర్ ట్యాంకుల నిర్వహణ పరిశీలించారు. ఆలమూరు, చింతలూరు, పెదపళ్ల, పినపళ్ల గ్రామాల్లోని ఆరు వాటర్ ట్యాంకులను పరిశీలించి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆయన వెంట ఆయా గ్రామాలపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.



