ఎస్పీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన మిలీషియా సభ్యులు కొయ్యూరు సిఐ, ఎస్సై కు ప్రశంస పత్రాల అం
దించిన జిల్లా ఎస్పీకొ య్యూరు (అఖండ భూమి) : జూన్ 27 అల్లూరి జిల్లాఅ ల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీ గాలికొండ దళానికి చెందిన నలుగురు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా గురువారం లొంగిపోయారు. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ నల్లబెల్లి గ్రామానికి చెందిన మిలీషియా కమాండర్ తాంబేలు సాయిరాం (డొంబు ), అన్నవరం గ్రామానికి చెందిన మిలీషియ సభ్యుడు వంతల కిరణ్ అలియాస్ (శ్రోమణి), తాంబేలు రమేష్, తూములోవ గ్రామానికి చెందిన కొర్రా బాబురావు అలియాస్( సీరు )కొయ్యూరు సీఐ పి.వెంకటరమణ మంప ఎస్సై లోకేష్ కుమార్ చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ల సమక్షంలో జిల్లా ఎస్పీ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. వరుస ఎదురు కాల్పులు సరెండర్లు మరియు అరెస్టుల వలన గాలికొండ ఏరియాలో దిశా నిర్దేశం చేసే నాయకత్వం పార్టీలో లేకపోవడం, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో పోలీస్ శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మంచి చెడుల గురించి వివరించడం, మారుమూల గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కార దిశగా అడుగులు వేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండడం తదితర కారణాలతో పాటు గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఆకర్షితులై గాలికొండ సిపిణ(మావోయిస్టు పార్టీ) దళాన్ని వీడి స్వచ్ఛందంగా అల్లూరి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు మిలీషియా సభ్యులు పేర్కొన్నారు.