ఇంటిపన్నుల చెల్లింపు గడువుపొడిగించాలి. ఎర్రగొండపాలెం అఖండ భూమి
10%రిబేటుతోజూలై30వరకు గడువు పొడిగించాలి.. బారువడ్డీ గా భారమవుతున్న ఆస్తిపన్ను పెంపును నియంత్రించా లి.. అదనపు గ్రంథాలయ సెస్ రద్దు చేయాలి..
విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ
ప్రధాన కార్యదర్శి
గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు
మున్సిపల్ ఆస్తి పన్నుల చెల్లింపు గడువు జూన్ నెలాఖరుతో ముగుస్తున్నందున 10శాతం రాయితీతో పన్నులు చెల్లించే వెసులుబాటు ను ప్రభుత్వం కల్పించాలని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు కోరారు. గత మూడు నెలలు సార్వత్రిక ఎన్నికల రీత్యా మున్సిపల్ అధికారులు ఆస్తిపన్ను నోటీసులను రేట్ పేయర్లకు బట్వాడా చేయలేదన్నారు. జూన్ రెండవ వారం నుండి పూర్వ తేదీ నోటీసు లందించి నెలాఖరు లోగా ఆస్తిపన్ను చెల్లించాలని డిమాండ్ చేయడం తగదన్నారు.రెండు అర్ధ సంవత్సరాల ఆస్తిపన్ను చెల్లించే రేట్ పేయర్లకు పది శాతం పన్ను రిబేటు కల్పించి జూలై నెలాఖరు వరకు గడువు పొడిగించాలని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నరహరిశెట్టి నరసింహారావు గారు, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు గారు డిమాండ్ చేశారు.ఏడాదికి 15శాతం వంతున పెరుగుతున్న పన్నుపై అదనంగా బారు వడ్డీ రీతిగా పెరుగుతూ 60శాతం ఆస్తిపన్ను దానిపై అదనంగా 8శాతం గ్రంథాలయ పన్ను వసూలు చేయడం భారంగా వుందన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆస్తిపన్నులను నియంత్రణ చేస్తామని పేర్కొన్న మ్యానిఫెస్టో హమీ ప్రకారం ఆస్తిపన్ను కు అదనంగా గ్రంథాల య పన్ను వసూలు చేయడం రద్దు చేయాలన్నారు. ఆస్తి పన్నులోనే చెత్త లైటింగ్ డ్రెయినేజీ గ్రంథాలయ పన్నులుండగా అదనంగా విధించిన చెత్త పన్ను రద్దు చేసిన పద్ధతిలోనే ఆస్తిపన్ను మీద అదనంగా ఏర్పడిన 8శాతం గ్రంథాలయ పన్ను రద్దు చేయడం సముచిత విధానమన్నారు. రిజిస్ట్రార్ శాఖలో భూముల ధర పెంపు చేసే ప్రక్రియ వున్నందున వాటి విలువల ప్రకారం ఆస్తిపన్ను మరింత పెరిగే దుస్థితి వుంద న్నారు. ఆస్తి విలువపై ఇంటి పన్ను విధానాన్ని వ్యతిరేకించిన ఎన్.డి.ఎ ప్రభుత్వ పార్టీలు తక్షణమే ఆదాయ ప్రాతిపదిక ఇంటిపన్ను విధించే మార్పులు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖా మంత్రి పి. నారాయణలకు తెలియచేస్తున్నామని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు
శ్రీ నరహరిశెట్టి నరసింహారావు, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..