గునిపూడిలో పెన్షన్ల నుండి అక్రమంగా వెయ్యి కోత…

గునుపూడి లో పెన్షన్ల నుండి అక్రమంగా వెయ్యి కోత…

పెన్షన్ ల నుండి బలవంతపు వసూళ్లు దారుణం…

నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, నాతవరం మండలం గునుపూడి గ్రామంలో వృద్ధులు, వితంతువుల నుంచి వారికి అందే జగనన్న పెన్షన్ల నుంచి అక్రమంగా 1000 రూపాయలు కోత విధిస్తూ వైసీపీ కార్యకర్తలు దందాలకు పాల్పడుతున్నారు. పూట గడవలేని వృద్ధుల నుంచి కూడా 1000 రూపాయలు బలవంతం గా లాగేసు కుంటున్నారు. పూట గడవడం కోసం పెన్షన్ల మీదే ఆధారపడి పస్తులతో జీవిస్తూ కుటుంబాన్ని నడుపుకునే కుటుంబాలను సైతం వదలడం లేదు. పేదల నుంచి దళితుల నుంచి బలవంతంగా దందాలకు పాల్పడుతున్నారు. ఈ వసూళ్లు తప్పని కొంతమంది వారించినా వినకుండా బెదిరిస్తూ పెన్షన్ల నుండి 1000 వసూలు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ వసూళ్లు చేయమన్నారని, మా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లే కదా అంటూ దందా వసూలు చేసే దళారులు సమాధానం ఇస్తున్నారు. బాధిత వృద్దులు,ప్రజాప్రతినిధులు అధికారులు దళారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!