తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ పొత్తు లో భాగంగా తుని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ను శనివారం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. తుని లో అనేకసార్లు గెలుపొంది తుని నియోజక వర్గం ను అభివృద్ది పథంలో నడిపించిన యనమల రామకృష్ణుడు మరియు అతని సోదరుడు యనమల కృష్ణుడు మధ్య విభేదాలు రాజేసేందుకు వైసీపీ కుట్ర పన్ని కొన్ని పత్రికలలో ‘యనమల కృష్ణుడు టీడీపీ కి రాజీనామా’ అంటూ తప్పుడు రాతలు రాయిస్తుండడం పిరికిబంద చర్యని టీడీపి కార్యకర్తలు, అభిమానులు మండి పడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి భయం తోనే ఇలాంటి నీతిమాలిన దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును ఈ కుట్రలు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు.
ANDHRA BREAKING NEWS NEWS PAPER POLITICS STATE