చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపులో నా ప్రమేయం లేదు..
-ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి..
-తనకు సమాచారం ఇవ్వకుండా దుకాణాలను తొలగించారని ఆగ్రహం..
-మున్సిపల్ కమిషనర్ ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేస్తా..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 15 (అఖండ భూమి) ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈనెల 11న. సోమవారం చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించడంలో తన ప్రమేయం లేదని. ప్రమేయం ఉందని వస్తున్న పుకార్లు అవాస్తవమని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శుక్రవారం అఖండ భూమి ప్రతినిధికి చరవాణిలో తెలిపారు. ప్రోటోకాల్ పాటించకుండా మున్సిపల్ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని తెలిసిన సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయంపై ప్రిన్సిపాల్ సెక్రటరీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరోసారి ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. పేద ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తానే తప్ప చిరు వ్యాపారుల పొట్టపై కొట్టేటంత దుర్మార్గుడిని కాదని. పేపర్లలో వచ్చిన కథనాలు చూసిన తర్వాతే చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించిన విషయం తెలిసిందని ఆయన వాపోయారు. ఈ విషయాన్ని చిరు వ్యాపారులు గమనించాలని ఆయన కోరారు.