విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్ దహనం

 

నాతవరం. మార్చి 14 (అఖండ భూమి)

 

అనకాపల్లి జిల్లా నాతవరం లో ట్రాక్టర్ తో గడ్డిని తరలిస్తుండగా కరెంటు వైర్లను తాకడం తో మంటలు వ్యాపించి గడ్డి కాలిపోయింది. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక గడ్డి మొత్తం కాలి బూడిదయింది. ఇంతలో ఫైర్ ఇంజన్ అక్కడకు చేరుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Akhand Bhoomi News