టీజేయు ఆధ్వర్యంలో దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కు ఘన నివాళులు
యాదాద్రి భువనగిరి జిల్లా
5ఏప్రిల్ శుక్రవారం
దూరదర్శన్ లో తెలుగు తొలి న్యూస్ రీడర్ గా పనిచేసిన శాంతి స్వరూప్ శుక్రవారం గుండెపోటుతో మరణించగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షానుర్ బాబా జిల్లా కార్యాలయం లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మొహమ్మద్ షానూర్ మాట్లాడుతూ దూరదర్శన్ టీవీలో తెలుగులో తొలిసారి వార్తలు చదివి ఆయనకి చెరుగని ముద్ర వేశారు.
ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది న్యూస్ రీడర్గా ఎదిగారని అన్నారు.
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ కాజా ఫస్యుద్దీన్, జిల్లా కోశాధికారి బైరపాక సీరిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టి కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.