గునుపూడి లో రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ ను అడ్డుకొనేది ఎవరు?

 

నాతవరం మండలం గునుపూడి లో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి పది సంవత్సరాలు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదని పలువురు గ్రామస్తులు యువకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పదేళ్ల క్రితం విరాళాలు సేకరించి విగ్రహాన్ని విక్రయించి గ్రామం లో ప్రతిష్టించారని తరువాత కొంతమంది రెండు వర్గాలుగా మరియు రెండు పార్టీల నాయకులుగా మారిపోవడం తో ఆవిష్కరణ ను ఆదమరిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ గ్రామ యువ నాయకులు బోసి రాజు మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్ మాసం లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపించాలని మా యువకులు కలిసికట్టు గా ప్రయత్నించగా కొంతమంది వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం విగ్రహ ఆవిష్కరణ జరిపవద్దని మా కాలనీ యువతను బెదిరించారని ఆవిధంగా ఆవిష్కరణ ను అడ్డుకున్నారని తెలిపారు. అయితే ఈ ఏడాదైనా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ యువత సంసిద్దమవగా ‘ఎలాచేస్తారో చూస్తాం’ అంటూ కొంత మంది సవాళ్లు విసరడం బాధాకరమని బాబా సాహెబ్ అంబేద్కర్ కీర్తిని ప్రపంచమే గుర్తించి గొప్పగా చెపుతున్న వేళ గునుపూడి లో మాత్రం అది శూన్యమని ఇక్కడ ఆ మహానుభావునికి అవమానమే మిగిలిందని గ్రామ యువకులు వాపోతున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కు మిగతా దళిత సంఘాల నాయకుల మద్దతు కావాలని ఆయన కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!