రిటైర్ కార్మికులకు ఒక్కొక్కరికి 10లక్షల ఏరియాస్ వెంటనే చెల్లించాలి

 

 

రిటైర్ కార్మికులకు ఒక్కొక్కరికి 10లక్షల ఏరియాస్ వెంటనే చెల్లించాలి

టి ఎన్ టి యూ సి ప్రధాన కార్యదర్శి మనిరాంసింగ్

బెల్లంపల్లి మే 20(అఖండ భూమి):బెల్లంపల్లి తెలుగుదేశం టి ఎన్ టి యూ సి కార్యాలయం లో మణిరమ్ సింగ్ మాట్లాడుతూ..కోలిండియాలో గ్రావిటీ చట్టాలను మార్చ్ 28:2018 రోజున 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెంచుతూ పార్లమెంటులో ఆమోదించినారు.అయితే ప్రభుత్వ ఉద్యోగులకు 2016 నవంబర్ నుండి అమలు చేసినారు. గ్రాటిటి చట్టంలో అధికారులకు 2017 నవంబర్ నుండి అమలు చేసినా రు కానీ కార్మికులకు ఈ మధ్యకాలంలో 20 16 నుండి 2018 మధ్యకాలంలో రిటైర్డ్ అయిన కార్మికులకు పెరిగిన గ్రాడ్యుటీని చెల్లించలేదు దీని వలన సుమారు 3 816 మంది కార్మికులకు అన్యాయానికి గురి అయినారు.గ్రాడ్యుటి విషయంలో అన్యాయానికి గురి అయిన రూ అన్యాయానికి గురి అయిన కార్మికుల సంఖ్య డివిజన్ల వారీగా మొత్తం సింగరేణి వ్యాప్తంగా 3,816 మంది కార్మికులు అన్యాయానికి గురి అయినారు వీరికి దాదాపు ఒక్కొక్కరికి 10 లక్షల వరకు సింగరేణి యాజమాన్యం చెల్లించవలసి ఉంది కానీ గ్రాడ్యుటీ చట్టం భారతదేశంలోని ఉద్యోగులందరికీ అధికారులకు ఒకే విధంగా ఉంటుంది బొగ్గు పరిశ్రమలు అధికారులకు చెల్లించి కార్మికులకు ఇవ్వకపోవడం తీవ్ర మైన వివక్ష గత ఆరు సంవత్సరాల నుండి సింగరేణి కాలేజ్ లేబర్ యూనియన్ టిఎన్టియుసి తరఫున అనేక దఫాలుగా రిటైర్డ్ అయిన కార్మికుల ద్వారా గనుల పైన జిఎం ఆఫీసులో సీ అండ్ ఎండి కి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. బొగ్గు పరిశ్రమలో అధికారులకు చెల్లించి కార్మికులకు ఇవ్వకపోవడం సరి అయింది కాదని వెంటనే సింగరేణి ఎదమాన్యం స్పందించి ఈ సమస్య పరిష్కరించి వెంటనే వారి కుటుంబాలను ఆదుకోవాలని సింగరేణిలో గెలిచిన గుర్తింపు కార్మిక సంఘం ప్రాతివిద్య సంఘాలు కూడా ఈ సమస్య పరిష్కారం కొరకు చొరవ చూపాలని లేనిపక్షంలో సింగరేణి కాలోరీస్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జి.ఎం ఆఫీస్ లో ముందు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేస్తామని సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టి ఎన్ టీ యూ సి హెచ్చరించింది.ఈ కార్యక్రమంలో పి మణిరాం సింగ్ సింగరేణి కాలేజ్ లేబర్ యూనియన్ టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు గద్దెల నారాయణ,బెల్లంపల్లి ఏరియా నాయకులు డి చంద్రమౌళి, వి.వెంకటస్వామి,పాషా జిల్లా నాయకులు ఓ జీవరత్నం జి గంగయ్య పొంతం యాదగిరి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎండి హసన్ ఎస్ సదానందం బొల్లు మల్లయ్య సిహెచ్ రమేష్ ఎం నరసింహ కొత్తూరు నారాయణ ఎస్కే ఇమామ్ గార్లు పాల్గొన్నారు…

Akhand Bhoomi News