దివంగత వైఎస్ఆర్సిపి నేత చెరుకులపాడు నారాయణరెడ్డి 7వ వర్ధంతి
సందర్భంగా చెరుకులపాడు లోని ఆయన సమాధి వద్ద పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ అన్న చెరుకులపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి తమ్ముడు డాక్టర్ కంగాటి వెంకట రామిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుండి వైసిపి పార్టీ నేతలు, కార్యకర్తలు, నారాయణరెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చి నారాయణరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకుని కొనియాడారు. 2009 నుండి 14 వరకు కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్చార్జిగా ఉంటూ పలు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేశారని నారాయణ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినప్పటికీ పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డి అందించిన సేవలను గుర్తు చేసుకొని ఆయన వెంట నడిచిన సందర్భాన్ని చర్చించుకున్నారు. నారాయణరెడ్డి ఆ తర్వాత వైసీపీలోకి చేరడం ఆయనకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక హతమార్చిన సంఘటనను గుర్తు చేసుకుని సంతాపం వ్యక్తం చేశారు..