నిషేధించబడిన సింథటిక్ ఫుడ్ కలర్‌ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలిపి విక్రయిస్తున్న మూడు టీ రీ-ప్యాకింగ్ హోల్ సేల్ షాపులు.

 

నిషేధించబడిన సింథటిక్ ఫుడ్ కలర్‌ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలిపి విక్రయిస్తున్న మూడు టీ రీ-ప్యాకింగ్ హోల్ సేల్ షాపులు.

రాజమహేంద్రవరం అఖండ భూమి;

రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో కల్తీ ఆహార పదార్ధములు తయారు చేయుట, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి అన్నారు.

మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పట్టణములోని టౌన్ హాల్ రోడ్డు లోని మూడు టీ రీ-ప్యాకింగ్ హోల్ సేల్ షాపులను విజిలెన్స్, రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.

రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ..

శ్రీ తేజ అస్సాం టీ ను తనిఖీ చేయగా :- FSSAI సర్టిఫికేట్ లేనందున ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు నోటీసులు జారీచేసియున్నారన్నారు. నిషేధించబడిన సింథటిక్ ఫుడ్ కలర్‌ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలపడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు టీ పౌడర్ ప్యాకెట్లను నమూనాలను విశ్లేషణ నిమిత్తం సేకరించామన్నారు. టీ పొడిని కల్తీ చేయడానికి ఉపయోగిస్తున్న టార్టాజైన్ (పసుపు) సన్ సెట్ పసుపులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్యాకింగ్ లైసెన్సు లేకపోవుట మరియు టీ పౌడర్ ప్యాకెట్లపై కన్స్యూమర్ కేర్ వివరాలు లేకపోవుటతో లీగల్ మెట్రాలజీ అధికారులు కేసు నమోదు చేసారని తెలిపారు. చేశారు. . టీ పొడిని కల్తీ చేయడానికి సింథటిక్ రంగులను ఉపయోగించినందుకు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ వారు U/s 420, 272 IPC క్రింద క్రిమినల్ కేసు నమోదు కొరకు పోలీస్ స్టేషన్ కు సిఫారసు చేసియున్నారని తెలిపారు.

అస్సాం టీ కంపెనీ ను తనిఖీ చేయగా:-

ప్యాకింగ్ లైసెన్సు లేకపోవుట మరియు టీ పౌడర్ ప్యాకెట్లపై కన్స్యూమర్ కేర్ వివరాలు లేకపోవుటతో లీగల్ మెట్రాలజీ అధికారులు రెండు కేసులు నమోదు చేసారని తెలిపారు. రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో కల్తీ ఆహార పదార్ధములు తయారు చేయుట, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు

ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు ముత్యాలు నాయుడు, నాగ వెంకట రాజు, జగన్నాధరెడ్డి, భార్గవ మహేష్, లక్ష్మీనారాయణ మరియు రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!