ఘనంగా పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కర్నూలు ప్రతినిధి, జూన్ 13, (అఖండ భూమి న్యూస్) :
చలో హైదరాబాద్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు నగర కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం నేషనల్ గోర్ బంజారా సమ్మోలణ్ ముఖ్య కార్యకర్తలతో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల మాట్లాడుతూ మా తండాలో మా రాజ్యం-మేము ఎంత మందిమో మాకు అంత వాటా అనే నినాదంతో 1997 జులై 1 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సంఘం ఏర్పడి నేటికీ 27 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. సంఘo ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బంజార జాతి ప్రతినిధుల సమావేశం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని లంబాడి మేధావులు పెద్దలు, విద్యార్థులు అందరూ కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేణావత్ రాము నాయక్, సేవలాల్ నాగరాజు నాయక్, రామాంజ నేయులు నాయక్, భాషా నాయక్, శ్రీను నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



