కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం అంగన్వాడీ ఉద్యోగులు కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం కలిసికట్టుగా శాలువా కప్పి సన్మానం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమ సమస్యలను ఆయనకు వెలబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు మాట్లాడుతూ గ్రామం లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ANDHRA BREAKING NEWS NEWS PAPER STATE