శరభన్నపాలెం లో సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన
సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ గాంధీ..
కొయ్యూరు జూన్ 19 (అఖండ భూమి) అల్లూరి జిల్లాకొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో వివిధ సిసి రోడ్ల నిర్మాణాలకు సర్పంచ్ కి మూడు సత్యనారాయణ ఎంపీటీసీ లోకుల సోమ గాంధీ బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. శరభన్నపాలెం గ్రామంలో స్మశాన వాటికకు వెళ్లే రహదారి 122 మీటర్లకు 3 లక్షల రూపాయల నిధులతోనూ, శరభన్నపాలెం గ్రామం నుండి వెలగల పాలెం పంచాయతీ సికాయ పాలెం వెళ్లే రహదారికి 2005 ఒక మీటర్లు 9 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేక ప్రజలు అనేది ఇబ్బందులు పడుతున్నందున సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దారకొండ నారాయణమూర్తి అల్లూరు జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు గొట్టేటి మహేష్ ఉప సర్పంచ్ సంపరి త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు